అంబర్‌పేట నియోజకవర్గం తులసీరాం నగర్ (లంక) ప్రభుత్వ పాఠశాలలో నోట్ బుక్స్ పంపిణీ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబర్‌పేట నియోజకవర్గం గవర్నమెంట్ పోలీస్ బాయిస్ హై స్కూల్ లో ఫర్నిచర్ పంపిణీ చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. అనంతరం మాట్లాడారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే దృక్పథంతో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.

గవర్నమెంట్ స్కూళ్లలో ఫర్నిచర్, కంప్యూటర్ ల్యాబ్స్, నోట్ బుక్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నాని వివరించారు. మరికొన్ని పాఠశాలల్లో టాయిలెట్ క్లీనింగ్ మిషన్లు పంపిణీ చేసి, శుభ్రత కోసం చర్యలు తీసుకున్నామన్నారు. 33 సంవత్సరాల తర్వాత దేశంలో ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం విద్యార్థులకు మరియు దేశ భవిష్యత్తుకు మేలు చేస్తుందని తెలిపారు. అన్ని రంగాల్లో మెరుగైన వసతులు కల్పించేలా విద్యావిధానాన్ని తీసుకురావడం జరిగిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.