ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి ఆలివ్ ఆకులు ఎంతో సహాయపడతాయి. అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి ప్రతిరోజు ఆహారంతో పాటు వీటిని తీసుకోవడం వలన ఎంతో మంచి మార్పును పొందుతారు. ఆలివ్ నూనె ఆరోగ్యానికి ఎంతో సహాయం చేస్తుందని చాలా శాతం మంది దీనిని ఎక్కువగా ఎంపిక చేసుకుంటారు. ఈ నూనెను ఆలీవ్ కాయల నుండి తయారు చేయడం జరుగుతుంది. అయితే వాటి ఆకులు కూడా ఎన్నో మంచి ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్నాయి. సహజంగా ఆలివ్ నూనె ను తరచుగా తీసుకుంటున్నా ఆలివ్ ఆకులకు సంబంధించి, వాటి ద్వారా కలిగే ఉపయోగాలు గురించి చాలా శాతం మందికి తెలియదు.
అయితే వీటి ఆకులను తీసుకోవడం వలన గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలను చెక్ పెట్టవచ్చు. ఆలివ్ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. దీంతో శరీరంలో ఉండే కణాలు ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా కాపాడతాయి. ముఖ్యంగా వీటిలో ఉండే హైడ్రాక్సిటైరోసోల్, లుటియోలిన్, అపిజెనిన్ వంటి గుణాలు రక్తపోటును కూడా తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాక రక్త లిపిడ్లను మెరుగుపరుస్తాయి మరియు శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేస్తాయి.
ఆరోగ్య నిపుణులు చేసిన కొన్ని అధ్యయనాలు ప్రకారం ఆలివ్ ఆకులను తీసుకోవడం వలన మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. అంతేకాకుండా అల్జీమర్స్ వంటి వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఆలివ్ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో రకాల క్యాన్సర్లను నిరోధించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఆకులను నీటిలో మరిగించి టీలా తాగవచ్చు లేక ఆలివ్ ఆకుల సారాన్ని క్యాప్సిల్స్ రూపంలో మార్చుకొని వీటిని నిల్వ చేసుకోవచ్చు. చాలా శాతం మంది వీటిలో ఉండే ప్రయోజనాలను పొందడానికి ఆహారంలో చేర్చుకొని నేరుగా తింటుంటారు.