417 కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయాల ఏర్పాటు – పవన్‌ కల్యాణ్‌

-

ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. 417 కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అధికారం చేపట్టిన నాటి నుండి పంచాయతీ వ్యవస్థలో సమూల ప్రక్షాళన చేపట్టి, గ్రామ స్వరాజ్యాన్ని సాధించే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, డిప్యూటీ‌ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలోని పంచాయతీరాజ్ శాఖ, 104.25 కోట్ల వ్యయంతో కొత్తగా 417 గ్రామ పంచాయతీ కార్యాలయాలను, కామన్ సర్వీస్ సెంటర్ల ఏర్పాటుతో నిర్మాణం చేసేందుకు నిర్ణయం తీసుకుందని తెలిపారు.

Establishment of 417 new Gram Panchayat Offices said Pawan Kalyan

వీటిలో 200 పంచాయతీలు ఇప్పటివరకు పంచాయతీ కార్యాలయాలు లేని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. పంచాయతీలలో వేగంగా గ్రామాల్లో సేవలు అందించేలా 1,422 నూతన కంప్యూటర్ల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 46.137 కోట్ల నిధులు పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసినట్లు వివరించారు. మిగతా 60% నిధులు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news