క్రిప్టో కరెన్సీ పేరిట రూ.100 కోట్ల మోసం చేసి విదేశాలకు పారిపోతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉమ్మడి కరీంనగర్,మెదక్, వరంగల్ జిల్లాల్లో క్రిప్టో కరెన్సీ పేరుతో రమేశ్ గౌడ్ అనే వ్యక్తి అక్రమ దందాను మొదలు పెట్టాడు. జీడీఆర్ పేరిట నకిలీ వెబ్‌సైట్ రూపొందించి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని అమాయకులను నమ్మించాడు.
ఈ క్రమంలోనే వాట్సప్ గ్రూప్స్ క్రియేట్ చేసి సింగపూర్,గోవా,దుబాయ్‌కు విహార యాత్రలు పంపిస్తామని చెప్పి జోరుగా ప్రచారం చేశాడు.అధిక లాభాలకు ఆశపడిన ప్రజలు పెద్ద ఎత్తున డబ్బును పెట్టుబడిగా పెట్టారు.రూ.100 కోట్ల భారీ డబ్బు జమ అయ్యాక విదేశాలకు పారిపోతున్న నిందితుడిని బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి తమ డబ్బు ఎలాగైనా తమకు ఇప్పించాలని బాధిత ప్రజలు డీజేపీ ఆఫీసులో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.