బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది : కవిత

-

గత పాలకుల హయాంలో పెద్దపల్లి జిల్లా కాలేదు, బిఆర్ఎస్ వల్ల మాత్రమే సాధ్యం అయింది అని MLC కవిత అన్నారు. రామగుండంలో 500 వందల కోట్లతో మెడికల్ కాలేజి పెట్టాలన్న ఆలోచన కేసీఆర్ దే. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఈ రోజు అధికారంలో లేకపోవచ్చు కానీ రానున్న ఎన్నికల్లో గెలిచేది బిఆర్ఎస్ మాత్రమే అధికారంలో ఉండేది బిఆర్ఎస్ మాత్రమే. సింగరేణిలో కుటుంబసభ్యులకు ఇచ్చే డిపెండెంట్ ఉద్యోగాలలో మారు పేర్ల పై ఉద్యోగం ఇచ్చే వకాశం ఉంటుంది.

ఇదే రేవంత్ రెడ్డి సింగరేణి ఎన్నికల్లో మాట ఇచ్చి ఇప్పుడు కార్మికుల బిడ్డలను ఇబ్బందులకు గురి చేస్తున్నది. సింగరేణి లోని ఫండ్స్ చాల మంది పిల్లలు చెందుతలేవు రాజీవ్ గాంధీ లాంటి పథకాలకు చెందుంతున్నది, కొడంగల్ కి వెళ్తున్నాయి. సింగరేణి లో బోనస్ 32శాతం చేసినం ఏకంట్ లో పడ్డాయి… కానీ ఈ ప్రభుత్వంలో 35శాతం అన్నారు కానీ అకౌంట్లో పడలేదు. మొన్న కూడా రైతు భరోసా రాత్రి ఎకౌంట్ లో పడతాయి అన్నారు కానీ పడ్డాయా పడలేదు. ప్రతి రోజూ ఏదో ఒకటి చెప్పి సెలవు అంటారు కానీ ఎకౌంట్ లో డబ్బులు పడవు అని MLC కవిత పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news