పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం కట్టి కోటి ఎకరాలకు నీరు అందించినం అని MLC కవిత అన్నారు. మేడి గడ్డ చిన్న రిపేర్ తో ఉంటే అది చూపి, ఎల్లంపల్లి లో నీటి నిల్వలు తగ్గించడం వలన రాష్ట్రానికి నీటి సమస్య ఏర్పడుతుంది. శ్రీధర్ బాబు ను డీమండ్ చేస్తున్న మేడిగడ్డను వాడండి.. ఇంజినీర్లు టీమ్ వచ్చి దాని వల్ల ఇబ్బంది లేదు అని నివేదిక ఇచ్చింది. అందుకే శ్రీధర్ బాబు దానిని నడిపించాలి. స్థానికంగా ఉన్న చేరువులను కాళేశ్వరానికి లింక్ చేసి నీరు నింపునకున్నం. నియంతృత్వ పాలన జరుగుతుంది.
అసెంబ్లీలో నామమాత్రపు పాలన చేస్తున్నారు. అంతే కాని నిజంగా పాలన చేయాలనే ఆలోచన వారికి లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎడాదిన్నర తర్వాత ముఖ్యమంత్రికి అంబేద్కర్ గుర్తుకు వచ్చిండు. రానున్న స్థానిక ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లా ప్రజలు బీఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి. అంతే కాకుండా తొందరలోనే సింగరేణిలో ఎన్నికలు ఉంటాయి అందులో సింగరేణి కార్మికులు టీబీజికేఎస్ కు పట్టం కట్టాలి అని MLC కవిత పేర్కొన్నారు.