తిరుపతిలో హై అలర్ట్. తిరుపతిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో తిరుపతిలో 144 సెక్షన్ అమలులో ఉంది. ఎస్వీ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
మరోవైపు తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపించగా.. తాము క్షేమంగానే ఉన్నామని వారు వీడియోలు రిలీజ్ చేశారు. ఇది ఇలా ఉండగా.. అర్థరాత్రి తిరుపతిలో హైడ్రామా చోటు చేసుకుంది..అభినయ రెడ్డి దాడి చేశాడని అంటున్నారు. టీడీపీ నేత మబ్బు దేవనారాయణరెడ్డి ఇంట్లో తమ కార్పొరేటర్లు ఉన్నారంటూ మాజీ డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి దాడికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. తన అనుచరులతో బీభత్సం సృష్టించిన అభినయ రెడ్డి… దాడికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి.