టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజును ఐటీ అధికారులు మంగళవారం ఉదయం కూడా విచారించారు. సంక్రాంతి పండుగ సమయంలో ఆయన నిర్మాణ సంస్థ ఎస్వీసీసీ ఆధ్వర్యంలో విడుదలైన సినిమాలు ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు భారీగా కలెక్షన్లను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే, ఐటీ చెల్లింపుల విషయంలో తేడాలు ఉన్నట్లు అధికారులకు సమాచారం రావడంతో ఐటీ శాఖ ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఇటీవల దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పుడు ఐటీ అధికారులు అడిగిన డాక్యుమెంట్స్, బ్యాంక్ స్టేట్మెంట్లను దిల్ రాజు మంగళవారం సబ్మిట్ చేసినట్టు సమాచారం.రెండు గంటలపాటు విచారణ అనంతరం ఐటీ అధికారులు.. దిల్ రాజును ఎప్పుడు పిలిచినా విచారణకు రావాలని, అందుబాటులో ఉండాలని కోరినట్లు తెలుస్తోంది.