టీడీపీ నేతలు తాలిబన్లలా వ్యవహరించారు : సుధాకర్ బాబు

-

రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ పదవుల ఉపఎన్నికల్లో చేయని అరాచకం లేదు అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. వైసీపీ పదవులను చేజిక్కించుకోవడానికి టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కారు. టీడీపీ నేతలు గూండాల్లా.. తాలిబన్లలా వ్యవహరించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 75 మున్సిపాలిటీలకు కేవలం 2 చోట్ల మాత్రమే టీడీపీ గెలిచింది.

ఆ రోజున మా అధినేత జగన్ అనుకుంటే ఆ రెండు కూడా మేము చేజిక్కించుకోవచ్చు.. కానీ మా సంస్కృతి అది కాదు. ఆడా, మగా తేడాలు లేకుండా దాడులు చేశారు. డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవుల కోసం వెంపర్లాడుతున్నారు. అడ్డదారుల్లో ఎన్నికలు నిర్వహించిన అధికారులే పూర్తి బాధ్యులు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకుండా ఎగనామం పెట్టాలని చూస్తున్నారు. పద్మ భూషణ్ గ్రహీత అయిన బాలకృష్ణ అడ్డదారిలో ఎన్నికలు జరిపారు. మంత్రి పార్థసారథి ఇళ్లలో దూరి మా నేతలను లాక్కొచ్చారు అని టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news