నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో నాలుగు నెలల కిందట నిర్మించిన మట్టంపల్లి చెరువు కట్ట మళ్లీ డ్యామేజీ అయ్యింది. నాసిరకంగా నిర్మించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.గత సంవత్సరం ఆగస్ట్ నెలలో వచ్చిన వరదల కారణంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని చౌటపల్లి గ్రామంలో మట్టంపల్లి చెరువు కట్ట కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.
దీంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెరువు కట్టను తిరిగి నిర్మించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అయితే, స్థానికంగా ఉండే సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీతో అక్కడి కాంగ్రెస్ లీడర్స్ మొత్తం పనులు చేయించినట్లు సమాచారం.నిర్మించిన 4 నెలలకే చెరువు కట్ట మళ్లీ పాడైంది. మొత్తం బీటలు వారింది. కాగా, సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ చేసిన ఈ పనులకు సంబంధించిన రూ. 2 కోట్ల బిల్లును మాత్రం తాము చేసినట్లు స్థానిక కాంగ్రెస్ నేతలు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో ప్రతిపక్షాలు అధికార పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పని చేసింది సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ.. బిల్లు లేపింది కాంగ్రెస్ నాయకులు
నాణ్యతకు తూట్లు.. చివరకు చెరువు కట్ట డ్యామేజ్
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో ఇది ఇరిగేషన్ తీరు
గత సంవత్సరం ఆగస్ట్ నెలలో వచ్చిన వరదల కారణంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని చౌటపల్లి… pic.twitter.com/mKEbVFGwbp
— Telugu Scribe (@TeluguScribe) February 5, 2025