సిరిసిల్లలో యూరియా కోసం బారులు తీరిన రైతులు

-

తెలంగాణలో మరోసారి ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. యాసంగి సాగు కోసం ఇప్పటికే రైతులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని నారు మడులు కూడా వేసుకుని సిద్ధమయ్యారు. కొందరు అన్నదాతలైతే ఇప్పటికే వరి నాట్లు కూడా పూర్తి చేసుకున్నారు.అయితే, వారికి యూరియా కోసం తిప్పలు తప్పడం లేదు.

ఈ క్రమంలోనే సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో యూరియా కోసం ఫర్టిలైజర్ కేంద్రం వద్ద అన్నదాతలు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డారు. యూరియా దొరక్క అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి లైన్లో నిల్చున్నా యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news