లగచర్ల తరహా మరో ఉద్యమం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అరెస్టు

-

మెగా ఫార్మాసిటీకి వ్యతిరేకంగా గతంలో కొడంగల్‌‌‌లోని లగచర్లలో పెద్ద ఎత్తున ప్రజాఉద్యమం ఎగిసిన విషయం తెలిసిందే. తాజాగా అదే మాదిరి ఉద్యమం మెదక్ జిల్లాలో కొనసాగుతోంది. గుమ్మడిదల మండలం ప్యారానగర్లో డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా 10 గ్రామాల ప్రజల నిరసనకు దిగారు.

దీంతో పోలీసుల వలయంలోకి డంపింగ్ యార్డ్ పరిసర గ్రామాలు వెళ్లాయి.అర్ధరాత్రి తమ ఇంట్లో వాళ్ళని అక్రమంగా అరెస్టు చేసి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు అంటు మహిళల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వారిని విడుదల చేయాలని కోరుతూ ముగ్గురు యువకులు స్థానికంగా ఉన్న సెల్ టవర్ ఎక్కి బెదిరింపులకు దిగగా.. మహిళలు, గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా బైటాయించి నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడకు వచ్చి ప్రజలకు మద్దతు తెలిపిన నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news