ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. నామినేటెడ్ పోస్టుల కు బిసిలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలపడం తో బీసీ లకు కీలక పదవులు వచ్చే అవకాశం ఉంది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కేపాసిటీ బిల్డింగ్ 2025కు కేబినెట్ ఆమోదం తెలిపింది. పట్టాదార్ పాస్ పుస్తకం చట్ట సవరణకు ప్రతిపాదనపై కేబినెట్ లో చర్చ జరిగింది. గాజువాక రెవెన్యూ పరిధిలో భూములు, నిర్మాణాల క్రమబద్దీకరణపై ప్రతిపాదనలు వచ్చాయి.
అలాగే… ఏపీ కేబినెట్ కీలక ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునేలా ప్రభుత్వ పాలసీ రానుంది. ఈ మేరకు ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వర్గాల పారిశ్రామిక వేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. విద్యుత్ సహా పలు విభాగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా వర్గ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది ప్రభుత్వం.