రాజధాని పనులకు ఎమ్మెల్సీ కోడ్.. ఈసీకి సీఆర్డీఏ లేఖ

-

గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని పనులు నిలిచిపోగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. మళ్లీ ఆ పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే పలు దఫాలుగా సమావేశం నిర్వహించిన కొన్ని పనులు చేపట్టింది. ప్రాధాన్యత క్రమంలో రాజధాని ప్రాంతంలో పనులు వేగవంతం చేసింది. అయితే రాజధాని పనులకు ఎమ్మెల్సీ కోడ్ అడ్డంకిగా మారిపోయింది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానంతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి రెండు గ్రాడ్యుయేట్ స్థానాలకు విశాఖ-విజయనగరం శ్రీకాకుళం ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 27న పోలింగ్ జరుగనుంది. 

రాజధాని పనులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది సీఆర్డీఏ. కేవలం గ్రాడ్యుయేట్ ఎన్నికలే కాబట్టి ఎన్నికల నియామవళి సడలించాలని సీఈసీని లేఖ ద్వారా కోరారు సీఆర్డీఏ అధికారులు. త్వరలోనే వరల్డ్ బ్యాంకు, ఏడీబీ రుణం మంజూరు కాబోతున్నాయి. పనుల ప్రాధాన్యత దృష్ట్యా ఇబ్బంది లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది సీఆర్డీఏ. వివిద జోన్ల పరిధిలోని 14వేల కోట్ల విలువైన పనులు చేపట్టాం.. ఎల్పీఎస్ లే ఔట్లలో రోడ్లు మంచినీటి సరఫరా డ్రైన్లు.. విద్యుత్ ప్లాంటేషన్  కొన్ని పనులు మొదలు పెట్టాలని ఆలోచనలో ప్రభుత్వం ఉంది. 

Read more RELATED
Recommended to you

Latest news