ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. బడా నేత జంప్ కానున్నాడు. ఏపీ పాలిటిక్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. ఏపీ మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి సాకె శైలజానాథ్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
నేడు అంటే శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. పార్టీలోని కీలక నేతలుగా భావించిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు బయటకు వెళ్తున్న క్రమంలో.. శైలజానాథ్ చేరిక వైసీపీలో జోష్ నింపినట్లు అయ్యింది.