బ్రహ్మా ఆనందం ట్రైలర్ రిలీజ్

-

హాస్య నటుడు బ్రహానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడనే చెప్పాలి. చాలా రోజుల తరువాత ఓ పుల్ ప్లెడ్జ్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మ ఆనందం. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్ కూడా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ట్రైలర్ ని పరిశీలించినట్టయితే.. థియేటర్ ఆర్టిస్ట్ అయిన బ్రహ్మానందం ఢిల్లీలో జరిగే నేషనల్ షోలో పాల్గొనాలని అనుకుంటాడు. దీనికోసం డబ్బులు అవసరం పడటంతో బ్రహ్మానందం మనవడిగా నటించేందుకు అంగీకరిస్తాడు. వారిద్దరి మధ్య జరిగే పరిణామాలను మనకు ఈ సినిమాలో కథగా చూపించబోతున్నట్టు ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. రాజా గౌతమ్ ఎంటర్టైనర్ తో పాటు ఎమోషన్స్ కూడా పలికించిన తీరు ప్రేక్షకుల్లో ఈ మూవీ పై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ తెరకెక్కించగా.. రాహుల్ యాదవ్ నక్కా నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీలో వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్ తదితరులు నటిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news