ఏపీలో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..మరో 4 గురు జంప్‌ !

-

ఏపీలో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. వైసీపీలో చేరేందుకు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేతలు సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారని సమాచారం అందుతోంది.

There are reports that senior Congress leaders are preparing to join YCP

మాజీ మంత్రులు పల్లం రాజు, రఘువీరారెడ్డి లతో పాటు మాజీ ఎంపీ హర్షకుమార్, లేడీ ఫైర్‌బ్రాండ్ పద్మ శ్రీ వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న కూటమి పార్టీల్లో కాకుండా.. వైసీపీలోకి ఈ నేతలు చేరబోతుండటం గమనార్హం.

మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడి చిన్న కుమారుడు, టీడీపీ నేత గాలి జగదీశ్ వైసీపీలో చేరనున్నట్టు సమాచారం. ఎల్లుండి మాజీ సీఎం జగన్ సమక్షంలో కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. నగరి టీడీపీ ఎమ్మెల్యే గా ఉన్న గాలి భాను ప్రకాశ్ సోదరుడే టీడీపీని వీడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మాజీ మంత్రి రోజాకు చెక్ పెట్టేందుకు జగదీశ్ ను పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి తెరపైకి తీసుకొచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మరో రెండు రోజుల్లోనే తేలనుంది.

Read more RELATED
Recommended to you

Latest news