పొలానికి నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టడంతో తల్లీ కొడుకు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.ఈ విషాద ఘటన వైఎస్సార్ జిల్లా బి.కోడూరు మండలంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గుంతపల్లి గ్రామానికి చెందిన కూరాకు జయరాం రెడ్డి (48), గురమ్మ (60) నేటి ఉదయం తెలుగు గంగ కాలువలో కింద ఉన్న తమ పొలానికి నీరు పెడుతున్నారు.
అదే టైంలో మోటారు ఒక్కసారిగా ఆగిపోయింది.దీంతో దానికి చిన్నపాటి మరమ్మత్తులు చేస్తుండగా జయరాం రెడ్డికి కరెంట్ షాక్ కొట్టింది. కొడుకు అరుపులు విని అతన్ని కాపాడబోయి తల్లి కూడా విద్యుత్ ప్రమాదానికి గురైంది.దీంతో ఇద్దరు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరి మృతితో గుంతపల్లి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.