చలికాలంలో మొక్కజొన్న సూప్ తాగండి.. ఈ సమస్యలను తగ్గించుకోండి..!

-

ఈ సీజన్లో సూప్స్ తాగటానికి చాలామంది ఇష్టపడతారు. ఒక్కొకరిది ఒక్కో టేస్ట్..కానీ చాలామందికి మొక్కజొన్న సూప్ అంటే కామన్ గా ఫేవరెట్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. అందుకే మొక్కజొన్నను కేరాఫ్ ఫైబర్ ఫుడ్ గా పిలుస్తారు. ఇది మలబద్దకాన్ని తొలగిస్తుంది. ఉదర సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో ఉంటే..విటమిన్ ఎ, బి, ఈ, మినరల్స్ ఉండటంతో..మన శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. అయితే ఈరోజు ఈ సూప్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఫుల్ గా చూద్దాం.

1. కంటిశుక్లం సమస్యను ఎదుర్కొంటున్న వ్యక్తులకు మొక్కజొన్న చాలా బెస్ట్. మొక్కజొన్నలో ఉండే ల్యూటిన్ క్యాటరాక్ట్ సమస్యను నివారిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది.

2. చలికాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు మరితం జాగ్రత్తగా ఉండాలి. స్వీట్ కార్న్ సూప్ తో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

3. చల్లని వాతావరణంలో మొక్కజొన్న సూప్ తాగితే ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అయితే సూప్ తయారు చేసేటప్పుడు కొంచెం నల్ల మిరియాల పొడిని తప్పకుండా కలపండి. ఇది శరీరాన్ని లోపల నుంచి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

4. ఇందులో ఉండే విటమిన్ బి శరీరంలో ప్రొటీన్లు, కొవ్వు జీవక్రియలను నియంత్రిస్తుంది. గుండె జబ్బుల నుంచి రక్షించడంలో మేలు చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు మొక్కజొన్నలో పుష్కలంగా ఉంటాయి.చలికాలంలో గుండె సమస్యలకు దూరంగా ఉండాలంటే వారానికి మూడుసార్లు స్వీట్ కార్న్ సూప్ తాగమంటున్నారు వైద్యులు.

5. వీటిలో ఉండే పాస్ఫరస్‌, మెగ్నీషియం, మ్యాంగనీస్‌, ఐరన్‌, కాపర్‌, జింక్‌ వంటి పోషకాలు.. ఎముకలు, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. ఇక స్వీట్‌ కార్న్‌లో ఉండే విటమిన్‌ బి12, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌లు రక్తహీనతకు చెక్‌ పెడతాయి.

6. నిత్యం ఒత్తిళ్లతో నలిగిపోయే వారికి స్వీట్‌ కార్న్‌ మంచి మందులా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫినోలిక్‌ ఫైటోకెమికల్స్‌ హైపర్‌ టెన్షన్‌ తగ్గిండచంలో బాగా పనిచేస్తుంది.

7. స్వీట్‌ కార్న్‌ చాలా త్వరగా జీర్ణం కావడంతో హశరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది. ఇలా ఎన్నో మంచి గుణాలున్న స్వీట్‌ కార్న్‌ను ప్రతిరోజూ కచ్చితంగా ఆహారంలో ఓ భాగం చేసుకుంటే ఆరోగ్యం మీ సొంతమవుతుంది

8. ఒక కప్పు స్వీట్ కార్న్ లో 342 క్యాలరీలు ఉంటాయి. కాబట్టి, త్వరగా బరువు పెరగాలనుకొనే వారు స్వీట్ కార్న్ తినడం ప్రారంభించండి. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

9. ఇందులో ఉండే యాంటియాక్సిడెంట్స్ డిఫరెంట్ టైప్స్ క్యాన్సర్ లను నిరోధించటంలో సహాయపడతాయి.. ఇది కోలన్ క్యానర్(పెద్ద ప్రేగు క్యాన్సర్ ను)ప్రమాదాన్ని తగ్గింస్తుంది.

10. వయస్సునవారిలో జాయింట్ పెయిన్స్ ను నివారించడానికి ఉడికించిన స్వీట్ కార్న్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

11. గర్భవతులు తమ ఆహారంలో స్వీట్ కార్న్ తప్పక తీసుకోవాలి. దీనిలో వుండే ఫోలిక్‌ యాసిడ్‌ మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. ఫోలిక్‌ యాసిడ్‌ తగ్గితే అది బేబీ బరువును తక్కువ చేస్తుంది. కనుక మొక్కజొన్న తింటే, తల్లికి, బిడ్డకు కూడా ప్రయోజనమే.

12. కొందరికి మతిమరుపు సమస్య ఉంటుంది. అలాంటివారు..స్వీట్ కార్న్ ని రెగ్యులర్ గా తినటం వల్ల..అందులో ఉండే థైమిన్ అధికంగా
మతిమరుపును నివారిస్తుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్న స్వీట్ కార్న్ ను ఇంకెందుకు లేట్ ఇప్పటినుంచే తినటం స్టాట్ చేసేయండి. కానీ అతిగా మాత్రం తినొద్దు.

Read more RELATED
Recommended to you

Latest news