చలేస్తోందని స్వెటర్‌ వేసేసుకుని వెచ్చగా పడుకుంటున్నారా.. అయితే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు

-

చలిపులి చంపేస్తుంది. పొద్దున అసలు లేవాలనిపించదు. రాత్రైతే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. స్వెటర్‌ వేసుకుని..కాళ్లకు సాక్స్ లు వేసుకుంటే గానీ..కాస్త వేడిగా ఉంటుంది. చలనినుంచి తప్పించుకోవడానికి అందరూ ఇదే పని చేస్తుంటారు. హాయిగా నిద్రపోవాలంటే..స్వెటర్‌ వేసుకుని పడుకుంటారు. ఇక మార్నింగ్‌ కూడా చాలామంది స్వెటర్‌ వదలరు. అయితే ఇలా ఇరవై నాలుగు గంటలూ స్వెట్టర్ వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. శరీరానికి వేడి అందిస్తుందని స్వెట్టర్ వేసుకుంటే.. దానితో వచ్చే ఇబ్బందులతో మరింత సమస్య వస్తుందట. అవేంటో ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా స్వెట్టర్ వేసుకున్నపుడు దాని ఊలు మన శరీరానికి గుచ్చుకుంటుంది. దీనివలన చర్మంపై మచ్చలు పడే అవకాశం ఉంటుంది. ఎక్కువగా స్వెట్టర్ వేసుకోవడం వలన ఇవి తప్పనసరిగా వస్తాయి. ఇది పెద్ద సమస్య కాదనుకోవచ్చు. ఇంకా ఉన్నాయిగా.. ఒక్కోసారి స్వెట్టర్ వెచ్చదనం ఎక్కువగా అయిపోతుంది. చలి వేస్తోందని ఫ్యాన్ లేకుండా..స్వెట్టర్ వేసుకుని పడుకుంటే… స్వెట్టర్ వెచ్చదనానికి శరీరం చెమటలు పడుతుంది. బీపీ పడిపోవడానికి కారణం అయ్యే అవకాశాలున్నాయి… ఇలా బీపీ పడిపోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

కొందరిలో శరీరంలోని వేడి బయటకు వెళ్ళే అవకాశం లేక రక్తపోటు పెరిగిపోయే చాన్స్ కూడా ఉంటుంది. దీనివలన తల తిరగడం, అలసట వంటి ఇబ్బందులు వస్తాయి. ఇక గుండె సంబంధిత సమస్యలు.. చక్కర వ్యాధి ఉన్నవారు స్వెట్టర్ వేసుకుని పడుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. స్వెట్టర్ వలన శరీరానికి గాలి తగలదు. దీంతో వేడి పెరిగిపోవచ్చు. అందువలన గుండెపోటు వచ్చే అవకాశం ఉందట.

స్వెట్టర్ వేసుకుననపుడు శరీరానికి ఆక్సిజన్ అందే అవకాశం తగ్గుతుంది. అందువల్ల ఊపిరి ఆడకపోవడం.. మైకంగా అనిపించడం వంటి సమస్యలోస్తాయి. కొంతమంది స్వెట్టర్ తో పాటు కాళ్ళకు సాక్సులు.. చేతులకు ఉన్ని గ్లౌజులు వేసుకుంటారు. ఇది మరింత ప్రమాదాన్ని పెంచుతుంది. వీటివలన చర్మం పొడిబారే సమస్య పెరిగిపోతుంది. తద్వారా ఎలర్జీ వంటి చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

కాబట్టి కాస్త చలితక్కువగా ఉన్నప్పడు స్వెటర్‌ తీసేయండి. అంతేకాదు..రాత్రి పడుకునే ముందు కూడా స్వెటర్‌ లేకుండా మందపాటి దుప్పటి వేసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news