రామ్ గోపాల్ వర్మ ‘శారీ’ మూవీ నుంచి స్టన్నింగ్ ట్రైలర్ రిలీజ్

-

టాలీవుడ్ విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ లేటెస్ట్ మూవీ ‘శారీ’.  గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో, ఆర్జీవీ-ఆర్వి ప్రొడక్షన్స్ LLP బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ వర్మ నిర్మిస్తున్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని పలు నిజజీవిత సంఘటనల ఆధారాలతో సైకలాజికల్ థ్రిల్లర్గా రూపొందుతోంది. కాగా ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఫిబ్రవరి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ రోజు ‘శారీ’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.

ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే.. ట్రైలర్ ఉహించని విధంగా చాలా త్రిల్లింగ్ గా ఉంది. అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి బాగా చూపించారు. కొంత భయంగా కూడా ఉంది. ఇక దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ ‘సోషల్ మీడియాలో ఎవరెవరు ముక్కు మొహం తెలియని వాళ్ళతో పరిచయం పెంచుకుని, వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ గాని, ఫోర్ గ్రౌండ్ గాని, ఏమి తెలియకుండా నమ్మేయడంతో, ఎదురయ్యే ప్రమాదాలు, భయంకర సంఘటనలు, మనం చాలా చాలా విన్నాం! చూసాం! ఇలాంటి నిజ జీవిత ఘటన ఆధారంగా తీసిన సినిమా ఈ ‘శారీ’ మూవీ’ చెప్పారు. ఇక నిర్మాత రవిశంకర్ వర్మ మాట్లాడుతూ ‘మా ‘శారీ’ చిత్రంలోని టీజర్, ‘ఐ వాంట్ లవ్’ అండ్ ‘ఎగిరే గువ్వలాగా’ అనే రెండు లిరికల్ సాంగ్స్ విడుదల చేసాం. వాటికి సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది.  తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.  సినిమా ఈ నెల 28న అన్ని భాషల్లో థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాం తప్పక చూడండి’ అంటూ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news