సోనియా, రాహుల్ కులాలపై బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రధాని మోడీ బీసీ కాదంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. రాహుల్ ది ఏ కులం? ఏ మతం? ఏ దేశం ? దీనిపై 10 జనపథ్ లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. సోనియా క్రిస్టియన్, ఇటలీ దేశస్తురాలు… రాహుల్ గాంధీ ది ఏ కులమని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.

రాహుల్ కి కులం , మతం , దేశం , జాతి లేదు.. రేవంత్ దీనికేం సమాధానం ఇస్తారు.? అంటూ నిలదీశారు. ఇలాంటివి మాట్లాడి కొరివితో తల గోకొంటున్నాడు రేవంత్.. Mlc ఎన్నికలను డైవర్ట్ చేసేందుకు ఇలాంటి స్టేట్మెంట్ చేస్తున్నాడని ఆగ్రహించారు. మోడీని బీసీగా దేశమంతా గుర్తించింది..ముస్లిం లను బీసీ లో కలిపితే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. కుల గణన పై కేంద్రం నింద వేసే కుట్ర చేస్తున్నారు.. ముస్లిం లను బీసీ లో నుంచి తొలగించి నివేదిక పంపాలని డిమాండ్ చేశారు.