రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత నాలుగుసార్లు ఎన్నికల కమిషన్ ను కలిశాం. ఎన్నికల సందర్బంగా జరుగుతున్న పరిణామాలపై ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం అని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి కీలక కామెంట్స్ చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఒక్క సభ్యుడు కూడా లేనిచోట్ల టీడీపీ నేతలు ఎలా పోటీ చేసి గెలుస్తారు. రాష్ట్రంలో జరిగిన ప్రతీ ఉప ఎన్నికలో అక్రమ మార్గాల్లో గెలవాలని చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా మాకు ఒరిగేదేమీ లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే మా తాపత్రయం అని ఆయన అన్నారు.
ఇక ప్రజాస్వామ్యం గౌరవం కోసమే ఇన్నిసార్లు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేస్తున్నాం. టీడీపీ నేతలు చట్టాన్ని చేతులోకి తీసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. తునిలో మున్సిపల్ చైర్మన్ ఇంటిని చుట్టుముట్టి దాడి చేశారు. అందుకే చలో తుని పేరుతో రేపు వైసీపీ కార్యకర్తలు పిలుపునిచ్చారు అని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పేర్కొన్నారు.