హైదరాబాదులో భారీ మొత్తంలో సాండ్ మాఫియా అనేది వెలుగులోకి వచ్చింది. ఇతర ప్రాంతాలకు ఇసుక బుక్ చేసి హైదరాబాదులో డంప్ చేస్తుంది మాఫియా. ఇసుక రీచ్ నుంచి 10000 రూపాయలకు కొనుగోలు చేసి హైదరాబాదులో 50 వేలకు అమ్ముతున్నారు. హైదరాబాదులో సాండ్ ను డంపు చేసి పెద్ద మొత్తానికి అమ్ముతున్న మాఫియా విషయాలు తెలుసుకొని.. తడ్ బండ్ తో పాటు పలుచోట్ల ఇసుక డంప్ లపై టాస్క్ ఫోర్స్ సోదాలు చేసింది.
అందులో జిల్లాలో బుకింగ్ డెలివరీ పెట్టుకొని హైదరాబాదులో ఇసుకను డంపు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. ఒక్కొక్క లారీకి 50 వేల రూపాయలు చొప్పున మాఫియా.. కస్టమర్ల నుంచి వసూలు చేస్తుంది అని పేర్కొన్నారు. నది తీర ప్రాంతాల్లో డెలివరీ పేరు చెప్పి హైదరాబాదులో ఇసుకను డంపు చేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఇసుక అక్రమ డంపింగ్ యార్డ్ల పై టాస్క్ ఫోర్స్ మూకుమ్మడి సోదాలు నిర్వహించి.. కేసులు బుక్ చేసారు. సరియైన పత్రాలు లేకుండా హైదరాబాద్ వరకు ఇసుకను తీసుకు వస్తున్నట్లు పేర్కొన్నారు అధికారులు.