కేంద్ర మంత్రి బండి సంజయ్ పై కాంగ్రెస్ నేత సాయి కుమార్ సంచలన వ్యాఖ్యలు

-

ఈ మధ్య కాలంలో  కేంద్ర మంత్రి బండి సంజయ్  కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్  స్పందించారు. ఈ మేరకు శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్కి ట్రైనింగ్ అవసరమని తీవ్ర విమర్శలు చేశారు. పదే పదే కాంగ్రెస్ పార్టీ  మీద విరుచుకు పడటం సరికాదని సూచించారు. ముందు మీ బీజేపీలో జరిగే అంతర్గత విబేధాల మీద దృష్టి పెట్టండి.. అంటూ విమర్శించారు. ఏది పడితే అది మాట్లాడి కేంద్ర మంత్రిగా ఉన్న మీ పరువు తీసుకోకండి.. అని హితువు పలికారు.

మీ నాయకత్వాన్ని మీ పార్టీ వాళ్ళు, మీ 8 మంది ఎమ్మెల్యేలే పట్టించుకోవడం లేదన్నారు. మీకు రాజకీయ శిక్షణ కావాలంటే గాంధీ భవన్ లో ఇస్తాం.. అని తీవ్ర విమర్శలు చేశారు. ముందు 8 మంది బీజేపీ  ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో రాకుండా చూసుకో.. అంటూ ఎద్దేవా చేశారు. బండి సంజయ్ నేర్చుకోవాల్సింది చాలా ఉందని, బీజేపీలో అజ్ఞానులు కోకొల్లలుగా ఉన్నారని ఫైర్ అయ్యారు. నేడు మనిషివా.. బీజేపీ నాయకుడివా..? అన్న విధంగా పరిస్థితి ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news