తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి.. తప్పకుండా కులగణన చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే.. మాట తప్పదు. సోనియాగాంధీ తెలంగాణ ఇస్తానని చెప్పింది.. మాట ప్రకారమే తెలంగాణ ఇచ్చింది. రాహుల్ గాంధీ కూడా మాట ఇచ్చారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఆ బాధ్యతతో ఉన్న రాహుల్ గాంధీ తనకు సీఎంగా అవకాశం కల్పించారు. మంత్రులు, పీసీసీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, చైర్మన్లు, అహర్నిశలు కృషి చేసిన వారంతా ఈ సమావేశంలో ఉన్నారు.
రాహుల్ గాంధీ మాట తూచ తప్పకుండా అమలు చేయాలని తెలంగాణ ధైర్యం చేసింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా ముందుకు రాలేదని తెలిపారు. ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో భాగస్వామ్యం చేసి కార్యక్రమం చేపట్టామని తెలిపారు. కేసీఆర్ ఒక్క రోజు సర్వే చేసి కాకి లెక్కలు చూపించారు. రాజకీయ సమాచారం కోసమే వారు సర్వే చేశారు. కానీ మేము చేసే సర్వే దేశానికే ఆదర్శంగా నిలవాలని కులగణన సర్వే చేపట్టాం. ఇందుకోసం ఒక మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసామని తెలిపారు.