తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మహాశివరాత్రి కోసం స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది తెలంగాణ ఆర్టీసీ. ఈ నేపథ్యంలోనే 50 శాతం చార్జీలు కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మహాశివరాత్రి కోసం స్పెషల్ గా వేసిన ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ధరలను 50% శాతం పెంచినట్లు తెలుస్తోంది.

అయితే ఇదే బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణాన్ని కల్పించనున్నారట. కానీ పురుషుల టికెట్లపై మాత్రం 50% ధర పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 24 అంటే రేపటి నుంచి ఈనెల 28వ తేదీ వరకు మహాశివరాత్రి స్పెషల్ బస్సులు నడుస్తాయి. శ్రీశైలం, వేములవాడ, ఏడుపాయల, కీసరగుట్ట వేలాల కాలేశ్వరం కొమురవెల్లి అలంపూర్ రామప్పకు.. ఈ స్పెషల్ బస్సులు నడుస్తాయి.
శివరాత్రి సందర్భంగా భక్తులకు ఆర్టీసీ గిఫ్ట్
మహా శివరాత్రి స్పెషల్ బస్సుల్లో 50 శాతం ఛార్జీలు పెంపు
స్పెషల్ బస్సుల్లో ఓ వైపు మహిళలకు ఫ్రీ.. మరోవైపు పురుషులకు టికెట్ రేట్ 50% పెంపు
మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 24 నుంచి 28 వరకు నడపనున్న స్పెషల్ బస్సులు
శ్రీశైలం, వేములవాడ,… pic.twitter.com/V6rq5h7pAs
— Telugu Scribe (@TeluguScribe) February 23, 2025