SLBC టన్నెల్ లేటెస్ట్ విజువల్స్ భయం పుట్టిస్తున్నాయి. 2004లో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీకారం చుట్టిన SLBC టన్నెల్ డేంజరస్ ప్రాజెక్ట్ అని 2018 లోనే హెచ్చరించారు కేసీఆర్. పంతనికి పోయి మళ్ళీ పనులు మొదలు పెట్టిన నాలుగు రోజులకే టన్నెల్ కూలింది.

ఇక అటు తెలంగాణ రాష్ట్రంలోని slbc సొరంగం ఘటనలో… కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సొరంగంలో మొత్తం 50 మంది కూలీలు ఇరుక్కుపోయినట్లు ప్రాథమిక సమాచారం. ఇందులో 42 మందిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే స్వరంగంలోనే ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఎనిమిది మంది సజీవంగా ఉన్నారా లేదా మరణించారా అనే విషయం తెలియాల్సి ఉంది. నిన్నటి నుంచి వాళ్లంతా లోపలే ఉన్నారు. సొరంగంలో కరెంటు అలాగే గాలి… ఆహారం లేదు. దీంతో రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దిగాయి. ఆ ఎనిమిది మందిని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
భయం పుట్టిస్తున్న కూలిన SLBC టన్నెల్ లేటెస్ట్ విజువల్స్
2004లో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీకారం చుట్టిన SLBC టన్నెల్ డేంజరస్ ప్రాజెక్ట్ అని 2018 లోనే హెచ్చరించిన కేసీఆర్
పంతనికి పోయి మళ్ళీ పనులు మొదలు పెట్టిన నాలుగు రోజులకే కూలిన టన్నెల్ https://t.co/lS2VbgDENp pic.twitter.com/Xl9qygATK0
— Telugu Scribe (@TeluguScribe) February 23, 2025