మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న తెరాస ప్రభుత్వానికి తెలంగాణా హైకోర్ట్ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. సచివాలయ నిర్మాణం విషయంలో హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత౦ ఉన్న సచివాలయం కాదని, నూతన సచివాలయం నిర్మాణం చేపట్టాలని కెసిఆర్ సర్కార్ భావించింది. అందుకు తగిన విధంగా ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కాళీ చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విశేష సేవలు అందించిన సచివాలయాన్ని తెలంగాణా ప్రభుత్వం కొన్ని కారణాలతో పెద్దగా ఉపయోగించలేదు. ఈ నేపధ్యంలో కెసిఆర్ కొత్తగా భవన నిర్మాణం చేపట్టి అందులో సచివాలయం నిర్వహించాలని భావించారు. అయితే దీనిపై హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు అయింది. దీనిపై దాదాపు రెండు నెలల నుంచి విచారణ వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ తరుణంలో తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం నిర్మాణానికి తెలంగాణా ప్రభుత్వం ముందుకి వెళ్ళవచ్చని స్పష్టం చేసింది. సచివాలయ నిర్మాణం కి సంబంధించి డిజైన్ల ప్లాన్, బడ్జెట్ పై తుది నిర్ణయాన్ని ఫైనల్ చేసుకోవచ్చని హైకోర్ట్ సూచించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఫిబ్రవరి 12 లోపు సమర్పించాలని ఆదేశాలు జారి చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 12 కి వాయిదా వేసింది.