మొన్న మహేష్ తో, ఈసారి ఏకంగా ‘ఆర్ఆర్ఆర్’ తోనే ఢీకొట్టబోతున్న బన్నీ….??

-

గత రెండేళ్లుగా సరైన సక్సెస్ లేని బన్నీ, ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన తాజా సినిమా అలవైకుంఠపురములో సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఆ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఎంతో గ్రాండ్ గా నిర్మించాయి. సంక్రాంతి సీజన్ తో పాటు వరుసగా సెలవలు రావడం కూడా సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఇక ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే రెండు సినిమాలకు కలెక్షన్స్ విషయమై నిర్మాతలు, ఫ్యాన్స్ మధ్య కొద్దిపాటి యుద్ధం అయితే జరిగింది. ఇక దీని తరువాత ప్రస్తుతం బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల ప్రారంభం అయిన ఈ సినిమా రెండవ షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇకపోతే కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే బన్నీ ఫ్యాన్స్ ని కొంత ఆలోచన్లలో పడేసింది. రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ జులై 30న రిలీజ్ కానుండగా, ఇటీవల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడి,

 

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది అంటూ పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే దానిపై ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ టీమ్ మాత్రం ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అయితే అది నిజం అయ్యే అవకాశాలు లేకాకపోలేదు అని అంటున్న వారు కూడా ఉన్నారు. దాని ప్రకారం ఒకవేళ అదే కనుక నిజం అయితే, ఆర్ఆర్ఆర్ సినిమాతో బన్నీ, సుకుమార్ ల మూవీకి భారీ పోటీ తప్పదు అన్నమాట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో పూర్తి నిజానిజాలు వెల్లడి అయితేనే కానీ వీటిని నమ్మలేము అని అంటున్నారు సినీ విశ్లేషకులు….!!

Read more RELATED
Recommended to you

Latest news