ఉపాధ్యాయుడికే తోటి ఉపాధ్యాయుల సమస్యలపై అవగాహన ఉంటుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వై అశోక్ కుమార్ కు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మద్దతు తెలిపి అనంతరం మీడియాతో మాట్లాడారు. టీచర్ల సమస్యల పై అవగాహన ఉన్న తోటి ఉపాధ్యాయుడు పై అశోక్ కుమార్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ధన రాజకీయాలకు టీచర్లకు మధ్య జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో ఉపాధ్యాయులు అందరూ తోటి ఉపాధ్యాయుడికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరాడు.
కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వై అశోక్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ జన సమితి పక్షాన తనకు మద్దతు ఇచ్చినందుకు ప్రొఫెసర్ కోదండరామ్ కు ధన్యవాదాలు తెలిపారు. తనను గెలిపిస్తే సీపీఎస్, 317 జీవో, కేజీవీబీ తదితర ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం చట్ట సభలో గళం వినిపిస్తా అన్నారు.