గ్రూపు-2 మెయిన్స్ కి 92 శాతం మంది హాజరు : APPSC

-

గ్రూపు-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఆదివారం నిర్వహించిన గ్రూపు-2 మెయిన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 92,250 మంది అభ్యర్థుల్లో 86,459 మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోగా.. వారిలో 92 శాతం మంది హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. గ్రూపు-2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని కూటమి ప్రభుత్వం సూచించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం యదావిధిగా పరీక్ష నిర్వహించింది.

పరీక్ష నిర్వహణ అభ్యర్థులకు శ్రేయస్కరం కాదని.. హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సినందున వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శికి సాధారణ పరిపాలన శాఖ లేఖ రాసింది. పరీక్ష రాసే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసిన వారని వాయిదా వేస్తే అది శాసనమండలి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి లేఖ రాశారు. శాసనమండలి ఎన్నికలు నిర్వహించే కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనే ఏపీపీఎస్సీ ఉన్న విషయాన్ని అందులో గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news