శాసన మండలి రద్దు బిల్లుపై నిర్ణయం ఏకగ్రీవంగా అసెంబ్లీలో ఆమోద ముద్ర పొందటంతో ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు మోపిదేవి వెంకటరమణ మినిస్టర్ పోస్టులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఎప్పటినుండో వీళ్ళిద్దరూ రాజకీయంగా జగన్ కి అండగా ఉంటూ ఒడిదుడుకుల్లో కూడా పార్టీకి అండగా ఉంటూ పని చేస్తున్న తరుణంలో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు విషయమై అంతటా అభివృద్ధి జరగాలని జగన్ శాసన మండలి రద్దు చేయడం నిర్ణయం స్వాగతిస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా పేర్కొన్నారు.
దీంతో శాసన మండలి రద్దు నిర్ణయం లోక్ సభ అదే విధంగా రాజ్యసభ ముందుకు వెళ్లిన తర్వాత రాష్ట్రపతి నోటిఫికేషన్ ఆమోదముద్ర పొందిన తర్వాత మంత్రి పదవులు కోల్పోయే పరిస్థితి ఏర్పడటంతో ఇద్దరికీ భవిష్యత్తులో వేరే పోస్టులు ఇస్తానని జగన్ ప్రామిస్ చేసినట్లు వైసీపీ పార్టీలో వినబడుతున్న టాక్. ఈ విషయంలో ఎవరికీ ఎక్కడ అన్యాయం జరగదని రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి మంత్రి పదవులు వదులుకోవడానికి రెడీ అయినందుకు ఇద్దరినీ కూడా జగన్ మెచ్చుకున్న ట్లు సమాచారం.
దీంతో జగన్ క్యాబినెట్ లో రెండు పదవులు ఖాళీ అయ్యే అవకాశాలు పరిస్థితులు కనపడుతున్న తరుణంలో వైసిపి పార్టీ ఆశావహులు ఆ రెండు మంత్రి పదవుల కోసం తెరవెనుక జగన్ తో మంతనాలు స్టార్ట్ చేస్తున్నట్టు వినికిడి.