నటుడు బాబు మోహన్ కి ఈసీ షాక్.. ఎన్నికలకు దూరం

-

మాజీ మంత్రి, సినీనటుడు బాబూమోహన్‌ వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా  నామినేషన్‌ వేశారు.  నామినేషన్ వేసిన రోజు వరంగల్‌ రిటర్నింగ్‌ అధికారి ఆఫీసుకు చేరుకున్న ఆయన నడుము నొప్పితో ఇబ్బంది పడగా.. స్టాఫ్ వీల్‌ఛైర్‌ ఏర్పాటు చేసి లోనికి పంపారు. రిటర్నింగ్‌ ఆఫీసర్ ప్రావీణ్యకు నామినేషన్‌ పత్రాలు అందజేశారు బాబుమోహన్.

పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా బాబు మోహన్‌.. వరంగల్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా.. అధికారులు తిరస్కరించారు. 10 మంది ప్రతిపాదకుల పేర్లు ప్రస్తావించినప్పటికీ బాబు మోహన్‌ నామినేషన్‌లో ఎవరూ సంతకాలు చేయకపోవడం.. అఫిడవిట్‌లో నిర్దిష్ట ఖాళీలు ఉన్నాయని ఆర్వో వెల్లడించారు. ఈ కారణాలతో ఆయన నామినేషన్‌ను రిజెక్ట్ చేసారు. అలానే నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురైంది. ఈ ఎన్నికల్లో ఆయన కుమారుడికి బీజేపీ టికెట్‌ కేటాయించగా.. రాములు డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బీఫాం లేకపోవడంతో ఆయన నామినేషన్‌ను ఎన్నికల​ అధికారులు రిజెక్ట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news