వైసీపీకి ప్రత్యేక హోదా ప్రజలిస్తే వస్తుంది : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

-

వైసీపీకి ప్రత్యేక హోదా ప్రజలిస్తే వస్తుంది.. కానీ ఎవ్వరో ఇస్తే రాదని ఏపీ  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రత్యేక పక్ష హోదా అడిగితే వచ్చేది కాదు. వైసీపీ నాయకులు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తామని పేర్కొంటున్నారు. ఓట్ల శాతం ప్రకారం.. వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెల్లాలి అన్నారు. జర్మనీలో అయితే ఓట్ల లెక్కన ప్రతిపక్ష హోదా ఇస్తారు. భారత రాజ్యాంగం ప్రకారం.. వచ్చిన సీట్ల లెక్కన ఇస్తారని పేర్కొన్నారు.

ఈ ఐదేళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు. ఇది గుర్తు పెట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ తేల్చి చెప్పారు. 11 సీట్లు ఉన్న వైసీపీకి ఆ హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వచ్చేదన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం.. లేకపోతే ప్రసంగాలను అడ్డుకుంటామనడం వైసీపీకి సరైన పద్దతి కాదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news