కాకినాడలో పని చేస్తున్న ఇంట్లో దొంగతనం చేయడానికి దొంగలకు పని మనిషి సహాయం అందించింది. కాకినాడ పట్టణంలోని మహాలక్ష్మీ అనే మహిళా కాళ్లు చేతులు కట్టి నోట్లో గుడ్డలు కుక్కి బంగారం, డబ్బులు దోచుకొని తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు పారిపోయారు. ఈ ఘటన పై ఇంటి ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన రక్షక భటులు కేసు నమోదు చేసుకొని తెలంగాణకు చెందిన రజిత, రఘు, లత, వెంకటేష్లను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా.. పని మనిషి రమలక్ష్మీ సహకారంతో ఈ దొంగతనం చేశామని ఆ నలుగురు నిందితులు చెప్పడంతో పోలీసులు షాక్ కి గురయ్యారు.
ఆ నలుగురికి సమాచారం ఇచ్చి డబ్బులు, బంగారం, దోచుకోవడానికి సహాయం అందించిన పని మనిషి రామలక్ష్మీ వారి వద్ద నుంచి 10 గ్రాముల బంగారం, 2.30వేల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దొంగలకు సమాచారం ఇచ్చి పని చేస్తున్న ఇంట్లోనే కన్నం వేసిన రామలక్స్మీని విచారిస్తున్నారు. తన యజమాని ఇంట్లో డబ్బులు, బంగారాన్ని చోరీ చేయడం లో సహాయం చేసినట్టు ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు.