కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పాకిస్తాన్‌కు ఓటు వేసినట్టే

-

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పాకిస్తాన్‌కు ఓటు వేసినట్లే అని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈనెల 27న గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ ఎన్నికలను కేంద్రమంత్రి బండి సంజయ్ ‘భారత్ – పాకిస్తాన్’ మ్యాచ్ లాంటిదిగా అభివర్ణించారు.

ఇందులో బీజేపీ పార్టీ భారత్ జట్టు అని.. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ టీం అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, బండి సంజయ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కీలక నేతలు ఆయన మీద మండిపడుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రిపై చర్యలు తీసుకోవాలని పలువురు ఈసీని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news