ప్రధానమంత్రి తో కులగణపై చర్చ జరగలేదు. అసెంబ్లీలో బిల్ చేశాక చర్చిద్దాం అనుకుంటున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నదులను పునరుద్ధరణ చేయడం మంచి ఆలోచనని ప్రధాని అన్నారు. హైదరాబాదుకు మెట్రో తెచ్చింది జైపాల్ రెడ్డి. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ మెట్రో సెకండ్ ప్లేస్ లో ఉండేది.. ఇప్పుడు 9 వ స్థానంలో పడిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాము. గెలుస్తామని అనుకుంటున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపిని గెలిపించడానికి BRS ఎమ్మెల్సీ పోటీ పెట్టలేదు.
మంత్రివర్గ విస్తరణ ఉందని నేను ఎప్పుడూ చెప్పలేదు. పిసిసి కమిటీ అంశం అధ్యక్షుని అడగండి. శివరాత్రి పూజలు ఉన్నందునే భట్టి విక్రమార్క ఢిల్లీకి రాలేదు. ప్రభాకర్ రావును రప్పించాలని కేంద్రానికి లేఖ రాశాను. గత ప్రభుత్వ అవినీతిపై కమిషన్లు వేశాము. కమిషన్ల నివేదిక వచ్చాకే ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. కొడంగల్ అసెంబ్లీ వ్యవహారాలు నా బ్రదర్ చూసుకుంటాడు. కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు నా బ్రదర్ ను పెట్టాం. దుబాయిలో కేదార్ చనిపోతే కేటీఆర్ ఎందుకు విచారణ కావాలని కోరడం లేదు అని రేవంత్ పేర్కొన్నారు.