మెజిస్ట్రేట్ ముందు కీలక వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ..!

-

మెజిస్ట్రేట్ దగ్గర వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేసాడు. జైల్లో.. సెల్ లో తనను ఒంటరిగా ఉంచారని న్యాయమూర్తికి తెలిపిన వంశీ.. తనకు ఆస్తమా సమస్య ఉందని ఏదైనా హెల్త్ ప్రోబ్లం వస్తె ఇబ్బందని కోర్టుకు తెలిపాడు వంశీ. ఇంకా తనతో పాటు వేరే వారిని కూడా సెల్ లో ఉంచాలని న్యాయమూర్తిని కోరిన వంశీ.. భద్రత పరంగా తనకు ఇబ్బంది లేదని పేర్కొన్నాడు.

అయితే వేరే వారితో ఉంచినపుడు ఏమైనా జరిగితే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పాడు జడ్జి. ఇప్పటికే మీకు దగ్గరలో అటెండర్ సౌకర్యం కల్పించారు కదా అని జడ్జి అడగ.. వంశీ భద్రత దృష్ట్యా మాత్రమే సెల్ లో ఒంటరిగా ఉంచామని జడ్జికి తెలిపారు ప్రభుత్వం తరపు న్యాయవాది. కానీ హెల్త్ పరిశీలనకు ఒక వార్డెన్ ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని జడ్జికి తెలిపింది ప్రభుత్వం. సత్య వర్ధన్ కు నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహిస్తే నిజాలు బయటకు వస్తాయన్న వంశీ.. తనను కేసుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారని వివరించారు. అయితే వంశీతో పాటు వేరే వారిని సెల్ లో ఉంచేందుకు ఆదేశాలు.. ఇన్చార్జి జడ్జిగా తాను ఇవ్వలేనని తేల్చి చెప్పింది న్యాయస్థానం. రేపు రెగ్యులర్ కోర్టులో మెమో ఫైల్ చేసుకోవాలని ఆదేశం ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news