బాబు, లోకేష్, పవన్ బూతులు తిట్టలేదా..? : అంబటి రాంబాబు

-

హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేశారు.. కానీ కనీస ఇంకితం లేకుండా మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను వేసుకోని ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు వెళ్లి ఆందోళన చేయడం సిగ్గు చేటని టీడీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ప్రతిది రాజకీయం చేస్తూ శవాలపై పేలాలు ఏరుకోవడం బీఆర్ఎస్ పార్టీకి పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఇరుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు రిస్క్యూ టీమ్స్ 24 గంటలు కష్టపడుతుంటే హరీష్ రావు బృందం అక్కడకు వెళ్లి హడావిడి చేసి, ఫొటోలకు పోజులు ఇస్తూ వారి పనికి ఆటంకం కలిగించకూడదన్న ఇంకితం కూడా లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం నిర్మాణ దశలో ఏ ఒక్క మీడియా సంస్థనైనా అక్కడకి అనుమతి ఇచ్చారా? కిలో మీటర్ల దూరంలో ఆపేసిన చరిత్ర మీది, దీనిపై చర్చకు సిద్ధమా అంటూ హరీష్ రావుకు సవాల్ విసిరారు.

దేశంలోని అన్ని రంగాల రెస్క్యూ టీమ్స్ యుద్ధ ప్రాతిపదికన పని చేయిస్తుంటే ఏమి చేయాలో అర్ధం కాక చేష్టలు ఉడికి కోడు గుడ్డు పై ఈకలు పీకే పని హరీష్ రావు పెట్టుకున్నాడని మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే సమన్వయం లేదని మాట్లాడుతున్నారని, మీరు ఏ సమన్వయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంత సమన్వయంతో నిర్మించిన కాళేశ్వరం ఎందుకు కూలిపోయిందో హరీష్ రావు చెప్పగలడా ? దానిపై చర్చకు సిద్ధమా? అంటూ నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news