జన ఔషధి కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకుని, అధిక ఖర్చుల భారం నుంచి బయటపడాలని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కొన్ని మందుల కంపెనీలు, ప్రైవేట్ వ్యాపారులు కలిసి జనఔషధ కేంద్రాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
జన ఔషధి కేంద్రాల్లో నాణ్యమైన మందులు దొరకవని చేస్తున్న అసత్య కథనాలన్నీ అవాస్తవమన్నారు.ఔషధాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి జనఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకు ప్రజలకు అందజేస్తున్నదని వివరించారు. ‘జనఔషధి దివస్- 2025’ సందర్భంగా మేడ్చల్-మల్కాజిగిరిలోని నేరేడ్మెట్ క్రాస్‌రోడ్‌లో నిర్వహించిన వాక్‌లో ఈటల పాల్గొని మాట్లాడారు. పేదరికం గురించి తెలిసినందున ప్రధాని మోడీ పేదల కోసం పథకాలు తీసుకు వచ్చారని గుర్తుచేశారు.