ఏపీ మీడియాకు ప్ర‌భుత్వం స‌రే.. ప్ర‌జా కోణం క‌న‌ప‌డ‌దా…!

-

రాజ‌కీయాలకు-ప్ర‌జ‌ల‌కు, నేత‌ల‌కు-ప్ర‌జాస‌మ‌స్య‌ల‌కు వార‌ధిగా ఉండాల్సిన మీడియా నేడు తానే రాజ‌కీ య దొంత‌ర క‌ప్పుకొని రాత‌లు వండి వార్చ‌డంతో “ఏది నిజం?“ అనేది ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది. ప్ర‌స్తు తం ఏపీని కుదిపేస్తున్న మూడు రాజ‌ధానుల బిల్లు, సీఆర్ డీఏ ర‌ద్దు బిల్లు వంటి వాటితోపాటు ఇంగ్లీష్ మీడియం స‌హా ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్‌ల బిల్లుల‌ను కూడా మండ‌లి తోసిపుచ్చింది(అంటే.. కొన్ని సూచ‌న‌లు, స‌ల‌హాల‌తో తిప్పి పంపింది). నిజానికి ఈ ప‌రిణామం.. ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టేదిగానే మారింది. దీంతో జ‌గ‌న్ ఇలాంటి మండ‌లిని ర‌ద్దు చేస్తే పోయేదేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

దీనికి సంబంధించిన చ‌ర్చ కూడా రేపు సోమ‌వారం అసెంబ్లీలోనే చ‌ర్చించ‌నున్నారు. ఇక‌, ఈ ప‌రిస్థితి ఇలా ఉంటే.. మ‌రోప‌క్క‌, ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను త‌ప్పుడివిగా చూపిస్తున్న మీడియా ప్ర‌చారం ఓ రేంజ్‌లో సాగుతోంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు వ్య‌తిరేక‌మ‌ని చెబుతున్న ఈ మీడియా సంస్థ‌ల‌కు .. అదేస మయంలో ప్ర‌జ‌ల విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ కూడా కేవ‌లం ఒకే కోణం క‌నిపించ‌డం ఆశ్చ‌ర్యంగా అనిపి స్తోంది. రాజ‌ధాని కోసం ఆందోళ‌న‌లు జ‌రుగుతున్న విష‌యాన్ని ఏ ఒక్కరూ కొట్టి పారేయ‌డం లేదు. అయి తే, అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తూ.. కూడా ఉద్య‌మాలు జ‌రుగుతున్నాయి.

విశాఖ‌లో పాల‌నా రాజ‌ధాని ఏర్పాటు చేస్తామంటూ ..ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌గానే అక్క‌డి ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు నిజంగానే సంబ‌రాలు చేసుకున్నారు. ఇక‌, క‌ర్నూలులో హైకోర్టు ప్ర‌తిపాద‌న ఎప్ప‌టి నుంచో ఉన్న‌దే. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకున్నారు. కానీ, ఓ వ‌ర్గం ప్ర‌జ‌ల త‌ర‌ఫున వ‌కాల్తా పుచ్చుకున్న ప్ర‌జాప్ర‌యోజ‌నం కోస‌మే ప‌నిచేస్తున్నామ‌ని చెప్పుకొనే మీడియాకు వీరి ఆనందాలు క‌నిపించ‌లేదు. ఇక‌, ఇప్పుడు ఇవే ప్రాంతాల్లో టీడీపీపై ప్ర‌జ‌లు ర‌గిలిపోతున్నారు. దీంతో రోడ్ల మీద‌కు వ‌చ్చి అల్ల‌ర్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయా దాడుల‌ను వైసీపీ ఖాతాలోకి వేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. నిస్వార్థం మాటున ఓ వ‌ర్గ ప్ర‌యోజ‌నాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌నేది వాస్త‌వం.

Read more RELATED
Recommended to you

Latest news