ప్రభుత్వంలో, నామినేటెడ్ పోస్టుల్లో మున్నూరు కాపు నేతలకు ప్రాధాన్యత దక్కడం లేదని పలువురు మున్నూరు కాపు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హెచ్ నివాసంలో ఇవాళ మున్నూరు కాపు నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లోని కీలక నేతలు హాజరయ్యారు. మంత్రివర్గం లో మున్నూరు కాపులు లేకపోవడం ఇదే తొలిసారని, నామినేటెడ్
పోస్టుల్లో కూడా అన్యాయం జరుగుతోందని నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కులగణనపై కృతజ్ఞత సభ పెడదామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా ప్రతిపాదించారు. అయితే మన సంఖ్యను తగ్గించారని మున్నూరుకాపు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మున్నూరు కాపుల సభ నిర్వహించాలని నేతలు నిర్ణయించారు.