గద్దర్ అవార్డులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన ప్రకటన చేశారు.ఆదివారం ఉదయం నగరంలోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భక్త రామదాసు జయంతి వేడుకలకు ఆయన హాజరై మాట్లాడారు. కళలు, కళాకారులను ప్రజాప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. గత ప్రభుత్వం కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయించిందని పేర్కొన్నారు.
నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ఇస్తామని చెప్పారు. ఉగాది పండుగను పురస్కరించుకుని గద్దర్ అవార్డులను ఇస్తామన్నారు.నాటక పోటీలను నిర్వహించి కళాకారులకు అవార్డులు ఇస్తామని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నట్లుగానే ఆధ్యాత్మికంగా కూడా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ ఉన్నారని సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల తెలిపారు. సీఎం సూచనల మేరకు భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.