డీలిమిటేషన్ పేరుతో లోక్ సభలో సౌత్ ఇండియా ప్రాతినిధ్యం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దీనిని వ్యతిరేకిస్తుందని తెలిపారు. దక్షిణ భారతంలో ఏ రాష్ట్రం సీట్లు తగ్గినా ఊరుకునేది లేదని, డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ తో పాటు కోర్టులో కూడా పోరాడుతామన్నారు.
మరోవైపు బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ముందు కమలం పార్టీ తన ఇంటిని చక్కదిద్దుకోనివ్వండి. ఆ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా మా పార్టీ మంత్రులే తెలిపారు. దీనిపై ఎలాంటి చర్చలు అవసరం లేదన్నారు. ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం పై వస్తున్న విమర్శలపై కూడా ఆయన రియాక్ట్ అయ్యారు.