Telangana: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల హడావిడి నెలకొంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఎమ్మెల్యే కోటా ఐదు ఎమ్మెల్సీ స్ధానాలకు నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇక నేటి నుంచి ఈనెల 10 వతేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు ఉంటుంది.

ఈ నెల 20వ తేదీన పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు లెక్కింపు ఉంటుంది. అయితే.. ప్రస్తుతం ఉన్న లెక్క ప్రకారం.. బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు గెలుచుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్సు ఉంది.