రాజస్థాన్ ప్రభుత్వంతో సింగరేణి భారీ ఒప్పందం !

-

తెలంగాణ ప్రభుత్వ చొరవతో సింగరేణి వ్యాపార విస్తరణలో ముందడుగు వేసింది. నేడు రాజస్థాన్ విద్యుత్ శాఖతో 3100 మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టులపై సింగరేణి చరిత్రాత్మక ఒప్పందం చేసుకోనుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సమక్షంలో ఎం ఓ యు చేసుకోనున్నారు. ఇందులో భాగంగా రాజస్థాన్ చేరుకున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎనర్జీ సెక్రటరీ శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ శ్రీ ఎన్.బలరామ్, ట్రాన్స్ కో సీఎండీ శ్రీ కృష్ణ భాస్కర్.

Singareni’s huge deal with the Rajasthan government

ఈ రోజు మధ్యాహ్నం రాజస్థాన్ లో ఎం ఓ యు చేసుకుంటారు. రాజస్థాన్ విద్యుత్ శాఖ అనుబంధ సంస్థ తో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. జాయింట్ వెంచర్ కంపెనీతో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ , రాజస్థాన్ లో 1500 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పాదనకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో సింగరేణి ఆర్థిక పరిపుష్టి కి అతి పెద్ద అవకాశం ఉంది. మొత్తం వ్యయం, లాభాల్లో 74 శాతం సింగరేణి, 26% రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్ కు వాటా ఉంటుంది. తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లో అతి పెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో జాతీయ స్థాయి కంపెనీగా సింగరేణికి గుర్తింపు పొందిందని అంటున్నారు కాంగ్రెస్‌ పార్టీ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news