ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో పేలుడు.. హమాలీలకు గాయాలు

-

కాకినాడ వార్పు రోడ్డులోని ఒక ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో పేలుడు సంభవించింది. సోమవారం బాలాజీ ట్రాన్స్ పోర్టు  కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన పార్శిల్ లోడ్ ను కూలీలు లారీ నుంచి కిందకు దించుతున్న సమయంలో ఒక కార్మికుడు పెద్ద పార్శిల్ ను లారీ నుంచి తీసి భుజాన వేసుకుని కిందకు దించుతుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే పలువురు కూలీలు గాయపడ్డారు.

వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్శిల్ దించుతున్న కూలీకి మాత్రం కాళ్లు,ః చేతులు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి పార్శిల్ వచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అందులో చిన్నపిల్లలు కాల్చే టపాసులు ఉన్నట్టు గుర్తించారు. నిబంధనల ప్రకారం.. పేలుడు పదార్థాలు ఉన్న పార్శిల్ ను అనుమతించడం నేరం.

Read more RELATED
Recommended to you

Latest news