ఇంద్రకిలాద్రి అమ్మవారి చీరల స్కామ్.. హైకోర్టు కీలక ఆదేశాలు

-

గత ప్రభుత్వ హయాంలో ఇంద్రకీలాద్రిలో 33,686 వేల చీరలు  మాయం అయినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మారిన అధికారులు తీరు మారలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చీరల స్కామ్ పై  పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అమ్మవారికి భక్తులు  ఇచ్చిన చీరల అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు ఇప్పటికే నిర్ధారించారు. 2018-19 మధ్య జరిగిన అమ్మకాల్లో
రూ.కోట్లలో అవినీతి జరిగిందని, రూ.1.68 కోట్ల మేర నగదు స్కాం జరిగినట్లు గుర్తించారు.

గత జూనియర్ అసిస్టెంట్, ఈవోకు షోకాజ్ నోటీసులు అయితే చీరల అమ్మకాల బాధ్యతలు ఈవో, జూనియర్ అసిస్టెంట్ నిర్వహించారు. ఈ మేరకు గత జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం, అప్పటి ఈవో భ్రమరాంబకు పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో షోకాజ్ నోటీసులపై సుబ్రహ్మణ్యం హైకోర్టును ఆశ్రయించారు. సుబ్రహ్మణ్యం పిటిషన్ పై  విచారణ చేపట్టిన ధర్మాసనం.. జిల్లా ఎండోమెంట్ అధికారితో ఎంక్వెరీ వేయాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు పూర్తి ఎంక్వెరీ జరిగే వరకూ పెనాల్టీ గానీ, చర్యలుగాని తీసుకోవద్దని తీర్పు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news