జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవీ ఇచ్చినట్టు ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇందుకు సంబంధించిన పత్రాలన్నింటినీ సిద్ధం చేయాలని జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆదేశించారు. తాజాగా నాగబాబు కి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవీ ఇవ్వడం పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ స్పందించారు.
పవన్ కళ్యాణ్ ఏమన్నాడు.. జనసేన పెట్టింది ప్రజల కొరకే.. మీ కొరకే, న్యాయం కొరకే ఫైట్ చేస్తానన్నాడు. కానీ అవినీతి కొరకు అని నేను మీకు చెప్పాను కదా.. 21 మంది ఎమ్మెల్యేల తరపున 1 ఎమ్మెల్సీ సీటు ఉంటే.. లక్షల మంది కష్టపడిన వారికి ఇవ్వడా..? కోట్లు రూపాయలు ఖర్చు చేసిన నాయకులకు ఇస్తున్నాడా..? ఇది కేవలం అవినీతి కుటుంబ రాజకీయ పార్టీ అని గతంలోనే చెప్పాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు కి హైదరాబాద్ లో ఉన్న యాక్టర్ ని తీసుకొచ్చి మనల్నీ అందరినీ తాకట్టుపెడుతున్నాడని కే.ఏ.పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసైనికులు ఇప్పటికైనా కుటుంబ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరండి అని కోరారు.